NewsWaves.news

నేనే ల‌ఫూట్ వెధ‌వ‌ని : రామ్ గోపాల్ వర్మ

నిత్యం ఏదో ట్వీట్స్ చేసి జ‌నాలు ఎంట‌ర్ టైన్ లేదా ఇబ్బంది పెట్టడం రామ్ గోపాల్ వ‌ర్మ‌కు బాగా అల‌వాటే. అయితే ప్ర‌స్తుతం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెర‌కెక్కిస్తోన్న వ‌ర్మ.. మ‌హానాయకుడు, చంద్ర‌బాబు గురించి ఎన్నో కామెంట్స్ చేశాడు.

మ‌హానాయ‌కుడు విడుదైంది కాబ‌ట్టి ఇప్పుడు కొత్త స్ట్రాటెజీని ఫాలో అవుతున్నాడు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌, మ‌న్మ‌ధుడు నాగార్జున‌, అతిలోక సుంద‌రి శ్రీదేవి ఉన్న చిత్రాన్ని షేర్ చేశాడు. అయితే ఇక్క‌డ వ‌ర్మ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

ఈ ఫోటోలో వ‌ర్మ కూడా ఉన్నాడు. అందుకే చివరి లెఫ్ట్ లో ఉన్న మహా లఫూట్ వెధవని నేనే.. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ లో గ్లాస్ లు ఉన్నాయి. మధ్యలో ఉన్న వాళ్ల గ్యాండ్స్ లో ఉన్నవేవో దాస్తున్నారు. శ్రీదేవి గారు రెండు చేతులు ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజాయితీ నాలోనూ, శ్రీదేవిలోనూ, నాగార్జునలో మాత్రమే ఉంది కాబట్టి’ అంటూ కామెంట్స్ చేశారు.

Related Articles