NewsWaves.news

వ‌ర్మ వాడుకున్న‌ట్టుగా సోష‌ల్ మీడియాను ఎవ‌రూ వాడుకోలేరు

ఒక్క పైసా కూడా ఖర్చు చేయ‌కుండా సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో వ‌ర్మ త‌రువాతే ఎవరైనా. తాజాగా వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా వ‌ర్మ‌లా అలాగే ప్ర‌మోట్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే కేవ‌లం ట్విట్ట‌ర్‌తోనే త‌న ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్‌ మొత్తం న‌డిపిస్తుంటాడు వ‌ర్మ‌. తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌, ట్రైలర్ అంటూ రోజుకో విధంగా త‌న ఫాలోవ‌ర్స్ ను బిజీగా ఉంచుతున్నాడు వ‌ర్మ ఎప్పుడెప్పుడు ట్వీట్ చేస్తాడా అని అభిమానులతో పాటు మీడియా సంస్థ‌లు కూడా వెయిట్ చేస్తుంటాయి. ఇలా ట్వీట్ చేయ‌గానే అలా పోస్ట్‌లు, న్యూస్‌లు అల్లేస్తుంటారు.

వారికి స్ట‌ఫ్ ఇవ్వాల‌నో.. లేదా వొడ్కాకు స్ట‌ఫ త‌క్కువ‌యింద‌నో తెలియ‌దు కానీ.. వారానికి కనీసం మూడు రోజులైనా విచిత్ర‌మైన ట్వీట్స్ చేసేస్తుంటాడు. చాలా సార్లు వ‌ర్మ‌కు సంబంధం లేని వ్య‌క్తులు కూడా వ‌ర్మ ట్వీట్‌కు బ‌లి అవుతుంటారు. కానీ ఏమ‌న‌లేరు.. ఎందుకంటే వ‌ర్మ‌తో పెట్టుకుంటే టైమ్ వేస్ట్ త‌ప్పా మ‌రోటి లేద‌ని వారికి తెలుసు. కానీ ఇవ‌న్నీ ప‌ట్టించుకోని వ‌ర్మ…సోష‌ల్ మీడియా ద్వారా త‌ను చెప్పాల్సి న విష‌యం చెబుతాడు. అలాగే త‌న సినిమా ప్ర‌మోట్ చేసేస్తాడు.

Related Articles