NewsWaves.news

శ్రీలంక దాడులు ప్రతికారమే…

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 300 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ మారణకాండకి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. మేమే ఈ దాడులు చేసింది అని స్పష్టం చేసింది .

అయితే ఈ దాడుల వెనుక ఉన్న కారణాలను తెలుపుతూ ఇస్లామిక్ స్టేట్ ఒక వీడియో విడుదల చేసింది. శ్రీలంక దాడులను ఐ ఎస్ నేత బాగ్దాధి సమర్థించుకున్నారు . ఈ వీడియోలో తమ అధీనంలోని కొంత భూభాగాన్ని కోల్పోయినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధినేత అబూ బకర్ ఆల్ బాగ్దాదీ చెబుతున్నట్లు ఒక వీడియో లో ఉంది. అయితే సిరియా లోని భఘజ్ నీ కోల్పోయిన విషయాన్ని అబూబకర్ దీనిలో అంగీకరించాడు. అందుకు బదులుగా ని శ్రీలంక రాజధాని కొలంబోలో దాడులు చేశామని సమర్థించుకున్నారు.

ముందు ముందు ప్రత్యేకమైన పోరాటం చేయబోతున్నామని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ బీబీసీ వార్త వెల్లడించింది. అయితే ఆడియో టేపులు అసలైనవా,నకిలీవా తెలుస్తామని అమెరికా ప్రకటించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి