NewsWaves.news

అమ‌రులకు నివాళులర్పించ‌డానికి కూడా కేసీఆర్‌కు టైమ్ లేదా?: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత రెండు మూడు సార్లు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చాడు.

తెలంగాణ రైతులంటే కేసీఆర్‌కు గౌర‌వం లేద‌ని..నిజామాబాద్‌లో ప‌సుపు, ఎర్ర‌జొన్న రైతులు ఆందోళ‌న చేస్తున్నా కానీ కేసీఆర్‌కు క‌నిపించ‌డం లేద‌న్నాడు. అదే స‌మ‌యంలో స్పీక‌ర్ పోచారంరెడ్డి త‌ల్లిగారు చ‌నిపోతే రెండు సార్లు పోచారం వెళ్లొచ్చార‌ని..ప‌క్క‌నే ఉన్న రైతుల గురించి ఆలోచించ‌లేద‌న్నాడు రేవంత్ రెడ్డి. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన జ‌వాన్ల‌కు నివాళులు అర్పించ‌డానికి కూడా ముఖ్య‌మంత్రికి స‌మ‌యం దొర‌క‌లేదా అంటూ ఎద్దేవా చేశారు.

Related Articles