NewsWaves.news

బలమైన సాక్ష్యాలు ఉన్నందునే రీపోలింగ్… ద్వివేది

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది నేడు రీపోలింగ్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రగిరి పోలింగ్‌ లో అక్రమాలు జరిగినట్టు చాలా బలమైన సాక్ష్యం ఉందని ఆయన అన్నారు.నేడు అమరావతిలో మాట్లాడిన ఆయన… చంద్రగిరిలో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు అతిక్రమించారని స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా తమ దగ్గర ఉందని ఆయన తెలిపారు.

ఆ వీడియో చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దారుణమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయా అని అనిపిస్తోందన్నారు.రీపోలింగ్ నిర్వహించడానికి అంత బలమైన వీడియో సాక్ష్యంగా ఉండడమే కారణమని అన్నారు. ఇక ఈ ఎన్నికలలో అవకతవకలు జరగడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ద్వివేది వెల్లడించారు. ఇక రెండో సారి రిపోలింగ్ జరపొద్దు అనే రూల్ ఏమీ లేదని ఆయన వెల్లడించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి