NewsWaves.news

ఖమ్మం నుంచి టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా… రేణుక చౌదరి

ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి. అలా జరగని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. రేణుక చౌదరి ప్రకటనతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లో సెగలు మొదలయ్యాయి. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావహులు పోటీలో ఉన్నారు. ఆ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది కూడా. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఆమె నివాసంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే సీటు కేటాయించకపోతే పార్టీని వీడుతానని రేణుక చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Related Articles