NewsWaves.news

రైతు కుటుంబాలను పరామర్శించనున్న రేణు దేశాయ్…

సినీ నటి రేణు దేశాయ్ రైతు సమస్యల నేపథ్యంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రం కోసం రేణుదేశాయ్ రైతులను కలిసి, వారి సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకోసం రేణు సోమవారం రోజు మంత్రాలయం, ఆలూరులో పర్యటించనున్నారు.

ఆదివారం రోజు మంత్రాలయం చేరుకున్న రేణు అక్కడి ఎస్.వి.బి గెస్ట్ హౌస్లో బస చేశారు. నేడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, అలాగే వారి కుటుంబాల పరిస్థితుల గురించి తెలుసు కోనున్నారు. రేణు దేశాయ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Related Articles