NewsWaves.news

అమర జవాన్లకు అండగా ఉంటాం : రిలయన్స్ ఫౌండేషన్

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ స్వచ్ఛంద సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. అమరులైన సైనికుల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తామని, వారి పిల్లల విద్య, ఉపాధి బాధ్యతలు స్వీకరిస్తామని, గాయపడ్డ జవాన్లకు హాస్పటల్ లో మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని.. వీటితో పాటు ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

ప్రపంచంలో ఏ దుష్ట శక్తి కూడా భారత ఐక్యతను దెబ్బతీయలేదని, మానవత్వానికి టెర్రరిజం పెద్ద శత్రువు అని, దేశం కోసం అమరులైన జవాన్ల త్యాగాలను, సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని రిలయన్స్ ఫౌండేషన్ తన పత్రికా ప్రకటనలో తెలిపింది.

Related Articles