NewsWaves.news

దేశం కోసం రెండో కొడుకుని కూడా త్యాగం చేస్తా : అమర జవాన్ తండ్రి

ఒక అమర జవాన్ తండ్రి మాటలు దేశ ప్రజలను కదిలిస్తున్నాయి. ఆ మాటలు సైనికులలో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. దేశం కోసం పెద్ద కొడుకుని కోల్పోయిన ఆ తండ్రి అదే భారతమాత సేవ కోసం చిన్న కుమారుడిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తూ జవాన్ లకే కాదు.. వారి కుటుంబ సభ్యులకు ఏ స్థాయి దేశభక్తి ఉంటుందో రుజువు చేస్తున్నాడు ఆ జవాన్ తండ్రి.

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా లో ఒక కిరాతక ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి. ఆ అమర జవాన్లలో బీహార్ కు చెందిన రథం ఠాకూర్ కూడా ఉన్నారు. తన కొడుకు మరణవార్త విన్న ఆ తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. అంత బాధలోనూ.. తాను మాతృభూమి కోసం మరో కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

“భరతమాత సేవలో పెద్ద కొడుకుని కోల్పోయాను. ఇప్పుడు నా రెండో కొడుకుని కూడా బార్డర్ లో పోరాటానికి పంపుతాను. ఈ దేశం కోసం రెండో కొడుకుని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ


ఈ కిరాతక చర్యకు పాల్పడిన పాకిస్థాన్ కి మాత్రం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే’ అంటూ ..ఉద్వేగంగా మాట్లాడారు రతన్ ఠాకూర్ తండ్రి. ఆ మాటలు ఇప్పుడు దేశభక్తికి కొత్త అర్థాన్ని చెబుతున్నాయి. సరిహద్దుల్లో సర్వం త్యాగం చేసి పోరాడుతున్న సైనికులకు కొత్త ఉత్తేజాన్నిస్తున్నాయి.

Related Articles