NewsWaves.news

సన్ రైజర్స్ కి బెంగళూరు షాక్

వెళ్తూ వెళ్తూ సన్రైజర్స్ కి బెంగళూరు షాక్ ఇచ్చింది .దాంతో హైదరాబాద్ ప్లేఆప్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇక ఈ రోజు జరిగే కోల్కతా మ్యాచ్ పైన ఆశలు పెట్టుకుంది.ఐపీఎల్ సీజన్ అంతటా పేలవ ప్రదర్శన చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరిలో విజయాన్ని అందుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాల్ని దెబ్బతీసింది .అయితే బెంగుళూరుకు ఈ మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ హైదరాబాద్ కి చాలా కీలకమైన మ్యాచ్ .కీలక మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది . హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది .కెప్టెన్ విలియమ్సన్ రాణించారు.విలియంసన్ 5 ఫోర్లు 4 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కోహ్లి డివిలియర్స్ తొందరగా పెవిలియం చేరారు .దాంతో సన్రైజర్స్ విజయం దాదాపు ఖరారు చేసుకుంటుందని అంతా అనుకున్నారు .

కానీ విండీస్ ఆటగాడు హెట్ మయర్ 47 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి గెలిపించారు. 65 పరుగులతో గురు కీరత్ రాణించారు .ఇప్పటికే చెన్నై ఢిల్లీ బొంబాయి ప్లే ఆఫ్ చేరగా నాలుగో స్థానం కోసం కోల్కత్త హైదరాబాద్ పంజాబ్ మధ్య పోటీ నెలకొంది .చివరి రోజైన ఈ రోజు చెన్నై పంజాబ్ ఢీ కొనపోతున్నాయి.కోల్కత్త ,ముంబై ఢీ కొంటాయి. అయితే ఈ రెండు మ్యాచ్లు ఈరోజు కీలకం కానున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి