NewsWaves.news

ప్ర‌పంచ‌క‌ప్ ఆడొద్దంటే ఆడం : ర‌వి శాస్త్రి

ప్ర‌పంచ క‌ప్ విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం చెప్పిందే త‌మ‌కు శిరోధార్యం అని.. ప్ర‌పంచ క‌ప్ ఆడ‌వ‌ద్ద‌ని ఆదేశిస్తే ఆడ‌మ‌న్నారు టీమ్ ఇండియా హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం, బీసీసీఐ చెప్పిందే పాటిస్తామ‌న్నారు. పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత పాక్‌తో సంబంధాలు తెంచుకోవాలి అనుకుంటున్న‌ భార‌త ప్ర‌భుత్వం, ఇప్ప‌టికే పాక్‌కు ఎన్నో షాకులిచ్చింది.

ఇందులో భాగంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ‌కప్ లో పాకిస్తాన్‌తో జ‌ర‌గ‌బోయే వ‌న్డే మ్యాచ్ కూడా ఆడ‌కుండా పాక్‌ను బ‌హిష్క‌రించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తోంది. దీంతో టీమ్ ఇండియా ఆట‌గాళ్లు కూడా పాయింట్స్ పోయినా ప‌ర్వాలేదు కానీ పాక్‌తో మ్యాచ్ విష‌యంలో ప్ర‌భుత్వం ఏం చెబితే అదే చేస్తామంటున్నారు.

Related Articles