NewsWaves.news

రాషిద్ ఖాన్ సంచ‌ల‌నం

క్రికెట్‌లో ప‌సికూన‌లుగా పిలిచే ఆఫ్గానిస్తాన్‌కు… పెద్ద పెద్ద టీమ్స్‌నే వ‌ణికించగ‌ల సత్తా ఉన్న‌ద‌ని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఈ టీమ్ పేస‌ర్ రాషిద్ ఖాన్ కు అంత‌ర్జాతీయంగా మంచి ఫ్యాన్ పాలోయింగ్ కూడా ఉంది. ఈ విష‌యాన్ని మ‌రోమారు ప్రూవ్ చేశాడు ర‌షీద్.

అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకొని ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్‌లో ఒక సంచ‌ల‌నంగా మారాడు ర‌షీద్‌. ఐర్లాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 32 ప‌రుగుల‌తో విజ‌యం సాధించిన ఆఫ్గాన్‌.. సిరీస్‌ను 3-0 తో కైవ‌సం చేసుకుంది.

ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి రంగంలోకి దిగిన ఐర్లాండ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసి ఓడిపోయింది.

Related Articles