NewsWaves.news

పాక్ ప్రధాని పిరికిపంద… రాందేవ్ బాబా

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆర్టికల్ 370, 35A లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలని, ఆ చట్టాన్ని కాశ్మీర్ ప్రజలకు కూడా వర్తింపచేయాలని రాందేవ్ అన్నారు. దేశం అంతా ఒకే రాజ్యాంగం పై నడవాలని, దాని నుండి జమ్ము కాశ్మీర్ ను వేరు చెయ్యొద్దని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్ 370, 35A ఆర్టికల్ లను రాజ్యాంగం నుండి తొలగించాలని రాందేవ్ డిమాండ్ చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై రాందేవ్ నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పిరికిపంద అని, పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఆయన ఒక తోలు బొమ్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాందేవ్.Related Articles