NewsWaves.news

క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి మ‌రో దెబ్బ వైకాపాలోకి రాంపుల్లారెడ్డి బ్ర‌ద‌ర్స్

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీల‌లో స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. నేత‌ల దూకుడు పెరిగింది. క‌ర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మ‌రో గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఆళ్ళ‌గ‌డ్డ టీడీపీ నేత‌లు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోద‌రులు పార్టీనుంచి వైదొల‌గి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబ‌ద్ లో వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ ను క‌లిశారు.

జ‌గ‌న్ వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో సైనికుడుగా ప‌నిచేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని, రానున్న ఎన్నిక‌ల‌లో వైకాపా అభ్య‌ర్థుల విజ‌యానికి కృషి చేస్తామని వారు చెప్పారు. రాంపుల్లారెడ్డి, ప్ర‌తాప్ రెడ్డిల‌తోపాటు  మ‌రికొంద‌రు ఆళ్ళ‌గ‌డ్డ టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ను క‌లిసిన‌వారిలో ఉన్నారు. 

Related Articles