NewsWaves.news

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత‌ను ఇరికించిన వ‌ర్మ‌

సంబంధం లేని విష‌యాల్లో వేలు పెట్టే రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల‌పై ప‌డ్డాడు. అందుకే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాతో తెదెపా పార్టీ వ‌ర్గాల‌ను తెగ‌ ఇబ్బంది పెడుతోన్న వ‌ర్మ‌..తాజాగా సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, వైకాపా పార్టీని కూడా ఇబ్బందిలో ప‌డేశాడు. ఈ సినిమా నిర్మాణానికి వైకాపా డ‌బ్బు ఇచ్చింద‌ని ఎప్ప‌టి నుంచో ఒక వాద‌న వ‌స్తోంది. దీన్ని ఒక్క ట్వీట్‌తో క‌న్‌ఫ‌ర్మ్ చేసేశాడు వ‌ర్మ‌. వైకాపా అధినేత జ‌గ‌న్‌, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత విమానంలో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు తీసిన ఒక చిత్రాన్ని ట్విట్ట‌ర్‌లో పెట్టి కొత్త‌గా మ‌రో వివాదానికి తెర‌లేపాడు.

Related Articles