NewsWaves.news

బాబుకి బస్తీమే సవాల్ అంటున్న వర్మ…

ఏపీ ఎన్నికల్లో టిడిపి పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాబుకు బస్తీమే సవాల్ అంటూ ట్విట్టర్ వేదికగా సంచలనం సృష్టిస్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడైతే తనని అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డు దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం రోజు సాయంత్రం 4గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను,బస్తీమే సవాల్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా బహిరంగ ఆహ్వానం అని తెలిపిన వర్మ.. చివరగా జై జగన్ అంటూ తన ట్వీట్ ముగించాడు.ఇక గతంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించిన వర్మని పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి