NewsWaves.news

దేశ భ‌క్తుడు వ‌ర్మ‌!

ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో.. ఎవ‌రిపై ట్వీటు బాంబే వేస్తాడో తెలియ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమా, సెల‌బ్రిటీల‌పై పిచ్చి, ప‌చ్చి కామెంట్స్‌తో రెచ్చిపోయే వ‌ర్మాలో ఒక దేశ భ‌క్తుడు కూడా ఉన్నాడు. పుల్వామా దాడి త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఇష్టం వ‌చ్చినట్టు మాట్లాడ‌టం..ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్ట‌డం చూసిన వ‌ర్మ త‌న స్టైల్లో రిప్లై ఇచ్చాడు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్లో ఇమ్రాన్‌ఖాన్‌ను ఒక ప్ర‌శ్న అడిగాడు వ‌ర్మ‌. ఇప్పుడ‌ది విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యంలో వ‌ర్మ‌ను ప‌చ్చి బూతులు తిట్టిన నోళ్లే పొగిడేస్తున్నాయి.

మీ దేశంలో బిన్ లాడెన్ ఉన్న విష‌యం ఎక్క‌డో ఉన్న పాకిస్తాన్‌కు తెలిసింది. కానీ మీకు తెలియ‌లేదు. మీ దేశం నిజాంగా ఒక దేశ‌మేనా.. అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌…

ఈ ప్ర‌శ్న‌కు ఇమ్రాన్ ఖాన్ ఏం స‌మాధానం చెబుతాడో..

దీనికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌డా పాకీ ప్ర‌ధాని ?

మాక్కూడా నేర్పించండి సార్….

ఫైన‌ల్ గా ముగ్గురు పెళ్లాల గురించి..

పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు పెడితే గిడితే వ‌ర్మ‌ను తీసుకెళ్లాలి మ‌రి. ఇమ్రాన్ ఖాన్ నోరు కూడా తెర‌వ‌డేమో వ‌ర్మ ప్ర‌శ్న‌ల‌కు!

Related Articles