NewsWaves.news

యోగా చేసిన వారికి రాజ‌యోగం.. అందుకే మోదీ ప్ర‌ధాని అయ్యాడు : రామ్ దేవ్ బాబా

యోగా గురువు రామ్ దేవ్ బాబా దేశ‌రాజ‌కీయాల‌పై కామెంట్స్ చేయ‌డం కామ‌న్‌. తాజాగా రామ్ దేవ్ బాబా యోగాను రాజ‌కీయాల‌తో లింక్ పెడుతూ కామెంట్ చేశాడు. యోగా చేసిన వారికి రాజ‌యోగం లభిస్తుంద‌ని..అందుకే జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ, న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రుల‌య్యార‌ని వ్యాఖ్యానించారు బాబా రామ్ దేవ్‌. ప్ర‌శాంత‌త చేకూర్చి, మ‌నిషిని స‌రైన దిశ‌లో తీసుకెళ్లే యోగాను దేశంలో ఉన్న నేత‌లంతా అభ్య‌సించాల‌ని బాబా రామ్‌దేవ్ స‌ల‌హానిచ్చారు. అనంత‌రం ఆయ‌న పుల్వామా దాడి గురించి మాట్లాడుతూ… తీవ్ర‌వాదాన్ని ప్ర‌మోట్ చేస్తున్న పాకిస్తాన్‌కు, ఉగ్ర‌వాదుల‌కు యుద్ధం ద్వారానే బుద్ది చెప్పాల‌న్నారు. ఇలా చేస్తే మ‌రో 50 ఏళ్ల వ‌ర‌కు పాకిస్తాన్ భార‌త్ వైపు చూడద‌న్నాడు .

Related Articles