NewsWaves.news

కౌంటింగ్ ప్రక్రియ పై రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు…

ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు.ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరగనుండగా దానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన స్పందించారు. తెలంగాణలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అంతే ప్రశాంతంగా కౌంటింగ్‌ కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలవుతుందని తెలిపారు.

మొదటగా పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అబ్జర్వర్ సమక్షంలో లెక్కిస్తామని తెలిపిన ఆయన ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు.వీవీ ప్యాట్ల నుంచి లాటరీ తీసి లెక్కిస్తామని,ఇదంతా సీసీ కెమెరాల నిఘాలోనే జరుగుతుందని తెలిపారు.అంతే కాకుండా ఒకవేళ ఈవీఎంలు పని చేయకపోతే వీవీ ప్యాట్లను లెక్కలోకి తీసుకోబోమని, వీవీ ప్యాట్లకు రీకౌంటింగ్‌ అవకాశం ఉంటుందని,ఈవీఎంలకు మాత్రం ఆ అవకాశం ఉండదని తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి