NewsWaves.news

పాకిస్తాన్‌..ఇవి నీకు చివ‌రి రోజులు : రాజా సింగ్

పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా భార‌తీయ వాయుసేన పాకిస్తాన్ గ‌గ‌న‌తలంలోకి వెళ్లి అక్క‌డ ఎయిర్ స్ట్రైక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌శసించిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాకిస్తాన్‌కు గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

పుల్వామా దాడికి ప్ర‌తీకారం తీరింద‌ని.. ఏం చేయ‌లేర‌ని అంటున్న కొంత మందికి ఈ దాడే స‌మాధానం అని చెప్పాడు రాజాసింగ్‌. న భూతో న భ‌విష్య‌త్ అన్న‌ట్టు వెయ్యి కిలోల బాంబులు పాకిస్తాన్‌పై కురిపించిన వాయుసేన‌ను పొగిడాడు రాజాసింగ్‌

ఇది ఆరంభం మాత్ర‌మే అని.. ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాల్సి వ‌స్తుంద‌ని.. ఇక నుంచి పాకిస్తాన్ త‌న రోజులు లెక్క‌బెట్టుకోవాల‌ని.. పాకిస్తాన్‌ను భ‌స్మం చేసే స‌మ‌యం వ‌చ్చేసింద‌న్నాడు రాజాసింగ్‌

Related Articles