NewsWaves.news

మోడీ ద్వేషించారు కానీ నేను ప్రేమించాను : రాహుల్ గాంధీ

వాలెంటైన్స్ డే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే చేయించగలదని.. అందుకే ప్రధాని మోడీ తనను ద్వేషిస్తున్నప్పటికీ పార్లమెంట్ లో ఆయనను కౌగలించుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఈరోజు రాజస్థాన్ లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


“మోడీ… నన్ను, నా కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని అవమానించి మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన నన్ను ద్వేషిస్తున్నారు అని తెలుసు. ఆయన ద్వేషానికి నేను నా ప్రేమను కౌంటర్ గా వేశాను” అని రాహుల్ అన్నారు. బీజేపీ దేశాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్ ఆరోపించారు. ప్రధానమంత్రి రైతులకు రుణమాఫీ చేయకుండా ఆయన స్నేహితులైన కార్పొరేట్లకు మాత్రం రుణమాఫీ చేస్తున్నారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ.

Related Articles