NewsWaves.news

షూ వేసుకుని తిరుప‌తి కొండెక్కిన రాహుల్

తిరుమ‌ల కొండ‌లు ఎక్కే స‌మ‌యంలో చిన్న పిల్ల‌లు కూడా చెప్పులు వేసుకోరు. వెంక‌న్న స‌న్నిధికి చేరే వ‌ర‌కు కాలిన‌డ‌క‌నే కొండెక్కుతారు. ఆ కొండ‌పై అణువ‌ణువునా శ్రీవారు ఉన్నార‌ని..ఆయ‌న ప‌విత్ర‌త‌ను కాపాడ‌టానికి భ‌క్తులు అలా చేస్తుంటారు. కానీ ఈ విషయం తెలిసో..లేక‌ తెలియ‌కో గానీ కాంగ్రెస్ ఛీప్ రాహుల్ గాంధి ఈ రోజు షూ వేసుకుని మ‌రి కొండెక్కాశారు.

రాహుల్ గాంధీ వెంటనే ఉన్న కాంగ్రెస్ నేత‌లు, కార్య‌కర్త‌లు కూడా ఈ విష‌యం చెప్ప‌లేక‌పోయారా ఏంటి అని భ‌క్తులు కోప్ప‌డుతున్నారు. క‌నీసం రాహుల్ గాంధీ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థం అవుతోంది. ఈ సంఘ‌ట‌న‌పై భ‌క్త‌లు నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

Related Articles