NewsWaves.news

తిరుపతికి రానున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర’ లో పాల్గొని తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించేందుకు రాహుల్ రానున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతిలోని తారక మైదానంలో ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.


ఈ రోజు రాహుల్ గాంధీ తిరుపతిలోని అదే వేదికను తన సభకి వేదికగా ఎన్నుకున్నారు. తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన మాట తప్పారని.. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తిరుపతికి రానున్న రాహుల్ గాంధీ కాలినడకన వెళ్లి
మధ్యాహ్నం మూడు గంటల తర్వాత శ్రీవారిని దరిశించుకుంటారు.

సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ కూడలికి చేరుకుని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం భరోసా బస్సు యాత్ర లో తారక మైదానం చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాహుల్ ఢిల్లీకి వెళ్తారు.

Related Articles