NewsWaves.news

అందుకే మోదీని కౌగిలించుకున్నా : రాహుల్ గాంధి

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కొంత కాలం క్రితం ప్ర‌ధాని మోదీని నిండు స‌భ‌లో కౌగిలించుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఈ కౌగ‌లింత బాగా పాపుల‌ర్ అయింది. లోక్‌స‌భ‌లో ఒక వైపు ఉండే రాహుల్‌.. మ‌రో వైపున‌కు వ‌చ్చి మోదీని ఇలా కౌగించుకోవ‌డం..త‌ర్వాత త‌న సీట్ ద‌గ్గ‌రికి వెళ్లి క‌న్నుకొట్ట‌డం… త‌ర్వాత మోదీ కూడా రాహుల్‌కు రివ‌ర్స్ పంచ్ ఇచ్చారు.

అయితే చాలా కాలం త‌రువాత ఇలా స‌డెన్‌గా ప్ర‌ధానిని కౌగిలించుకోవాల‌ని ఎందుకు అనిపించిందో తెలిపాడు రాహుల్‌. ఒక ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాహుల్ ఈ సంఘ‌ట‌న వెన‌క ఉన్న ఆంత‌ర్యం ఏంటో వివ‌రించాడు.

ప్ర‌ధాని మోదీ జీవితంలో ప్రేమ లేద‌ని..అందుకే ఆయ‌న్ను కౌగిలించుకున్నాను అన్నాడు రాహుల్‌. ఆ ఆత్మీయ ఆలింగనం త‌రువాత మోదీ ఆశ్చర్య‌పోతార‌ని… అస‌లు ఏం జ‌రుగుతుందో ఆయ‌న‌కు అర్థం అయి ఉండ‌దు అన్నాడు చిన్న‌బాబు. తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల ప్రేమ వ్యక్త పరచాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles