NewsWaves.news

ఇది అమానుషం, పాశవికం…పుతిన్, కె.పి.శ‌ర్మ

పుల్వామాలో ఉగ్ర‌వాదుల పాశ‌విక దాడిని పలువురు అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు ముక్త‌కంఠంతో ఖండించారు. దాడిచేసిన‌వారికి, స‌హ‌క‌రించిన‌వారికి ఖ‌చ్చితంగా శిక్ష ప‌డాల్సిందేన‌ని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రజల ఆవేదనను పంచుకుంటున్నామని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఉగ్ర‌వాదుల కిరాత‌క చ‌ర్యను ఎట్టి ప‌రిస్థితుల‌లోను స‌హించేది లేద‌ని నేపాల్ ప్ర‌ధాని కె.పి.శ‌ర్మ చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని అంత‌మొందించేందుకు భార‌త్ కు ఎల్ల‌వేళ‌లా త‌మ స‌హ‌కారం ఉంటుంద‌న్నారు.

Related Articles