NewsWaves.news

పాకిస్థాన్ కు ఫస్ట్ షాక్ ఇచ్చిన భారత్

పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగ్రవాద దాడి అనంతరం పాక్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను తొలగించిన కేంద్రం … తాజగా పాకిస్థాన్ నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతం పెంచింది. మరి కొన్ని పాకిస్థాన్ వస్తువుల దిగుమతి పై నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. పెంచిన కస్టమ్స్ డ్యూటీ వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
1996 సంవత్సరంలో పాకిస్థాన్ కు భారతదేశం ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఇచ్చింది. అయితే ఇటీవల పుల్వామాలో పాక్ ప్రోద్భలంతో జరిగిన ఉగ్రదాడి లో 44 మంది భారత జవాన్లు వీర మరణం పొందడంతో పాకిస్థాన్ పై కఠిన చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం.

Related Articles