NewsWaves.news

సైకో శ్రీనివాస్ ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌

సైకో కిల్ల‌ర్ శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించారు పోలీసులు. అతను ఒక అమ్మాయి ప్రేమ‌లో ఉన్నాడ‌ని… ఆమె కూడా అత‌న్ని ప్రేమించ‌డం వ‌ల్లే ఆమెను చంప‌లేద‌ని తెలిపారు.

Psycho Killer Srinivas Reddy Arrested

హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో శ్రీనివాస్ రెడ్డికి రెండు ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఒక్క ఫేస్ బుక్ ఖాతాల్లో ఒక్క యువతితో శ్రీనివాస్ రెడ్డి కొన్ని పోటోలను పోస్ట్ చేశాడు. వేములవాడకు చెందిన ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి భావించాడని తమ దర్యాప్తులో పోలీసులు కనుగొన్నారు.

ఆ యువతి కూడ శ్రీనివాస్ రెడ్డి ప్రేమకు సానుకూలంగా స్పందించినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆ యువతి కోసం శ్రీనివాస్ రెడ్డి తరచూ వేములవాడకు వెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ఆ యువతితో శ్రీనివాస్ రెడ్డికి పరిచయం ఉంది. వేములవాడ దేవాలయానికి వెళ్లిన సమయంలో ఆ యువతితో శ్రీనివాస్ రెడ్డికి పరిచయం ఏర్పడింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి