NewsWaves.news

లేదంటే చంద్రబాబు జైల్లో ఉండేవాడు… ప్రకాష్ జవదేకర్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కేంద్ర మంత్రి బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ దయవల్లే 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని,ప్రస్తుతం సచివాలయంలో ఉంటున్నారని,లేదంటే చంద్రబాబు జైలులో ఉండేవారని జవదేకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

చంద్రబాబునాయుడు ఒకప్పుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాత వాజ్ పెయ్ కి, ఇప్పుడు మోడీ కి వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారని చంద్రబాబును ప్రశ్నించారు జవదేకర్.

ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, బిజెపిల మధ్య గత కొంతకాలంగా మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మోడీ విశాఖ రానున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి.



Related Articles