NewsWaves.news

ఆగస్ట్ 15 న ‘సాహో ‘విడుదల.

బాహుబలి చిత్రం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్.ప్రభాస్ నటిస్తున్న తర్వాత చిత్రం సాహో.ఈ చిత్రం గత మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణ కి తెరపడింది.సాహో చిత్రం ఈ ఆగస్ట్ 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

‘సాహో ’సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ‘సాహో- చాప్టర్‌-1’, ‘సాహో చాప్టర్-2’ అంటూ ఈ సినిమా మేకింగ్‌ వీడియోలను విడుదల చేశారు. వీటికి విశేషమైన స్పందన లభించింది. ‘బాహుబలి 2’ వంటి సినిమా తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి