NewsWaves.news

ప్ర‌భాస్‌, అనుష్క క‌లిసి జ‌పాన్ ఎందుకు వెళ్తున్నారో?

ప్ర‌భాస్‌, అనుష్క గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా అది అభిమానుల‌ను అల‌రిస్తుంది. వాళ్లిద్ద‌రు క‌లిసి ఎక్క‌డైనా కనిపిస్తే చాలూ…పెళ్లి గురించి వార్త‌లు పుట్టేయ‌డం కామన్‌. ఇలాంటి వార్త‌లే ఇప్పుడు మ‌ళ్లీ పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే త్వ‌ర‌లో ప్ర‌భాస్‌, అనుష్క జోడీ క‌లిసి జ‌పాన్ వెళ్ల‌నుంది. ఎందుక‌నేదేగా మీ సందేహం..మిర్చీ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి.


అయితే ఈ విష‌యం తెలియ‌క‌ చాలా మంది వాళ్లు జ‌పాన్‌కు ఎంజాయ్ చేయ‌డానికి వెళ్తున్నారు… వాళ్లిద్ద‌రు ఏదోక రోజు పెళ్లి చేసుకుంటారు అని పుకార్లు పుట్టిస్తున్నారు. వాస్త‌వానికి బాహుబ‌లి సినిమాకు జపాన్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ప్ర‌భాస్‌కు అక్క‌డ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో ‘మిర్చి’ని అక్కడ విడుదల చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయి.

అందులో భాగంగా మార్చి 2న ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోందట. దాంతో ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిందిగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ పంపిన ఆహ్వానం మేరకు ఈ జోడి జపాన్ వెళ్తున్నట్టు తెలుస్తున్నది.


Related Articles