NewsWaves.news

మౌనం- మ‌హ‌త్యం

మౌనం దైవభాష, సనాతనం, మౌనం లిపి లేని విశ్వభాష. మౌనం దివ్యత్వానికి ద్వారం. మౌనం సనాతన భాషా స్రవంతి, మౌనం నిశ్శబ్ధ మంత్ర ఘోష , మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబద్ధ సంభాషణ. మౌనం నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం ఇదే ఆత్మ సాక్షాత్కారం. మానవున్ని మాధవునిగా చేయునది మౌనమే. దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడానికి మౌనమే ఉత్తమ అర్హత పత్రం.ఎక్కడ అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది ఉండదు, ఆలోచనలు ఉండవు, వృధా మాటలు ఉండవు, ప్రతి ఆలోచన లక్ష్యంవైపే, ప్రతి మాట అర్థవంతమే.

✿ మౌనం అంటే ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండడం.

✿ మౌనమంటే తనలో తాను నిరంతరం ఎరుకతో ఉండడం.

✿ మౌనమంటే చింతన లేని తపస్సు.

✿ ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం.

✿ మౌనం నుంచి జ్ఞానం ఉదయిస్తుంది.

✿ మౌనం మన అంతరంగాన్ని.

✿ మౌనం అంతర్ముఖ పయనం చేస్తుంది.

✿ మౌనం అంతర్వాణిని దర్శంపచేస్తుంది.

✿ మౌనం అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.

✿ మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది.

✿ మౌనమే సత్యం శివం సుందరం అదే అఖండానందం, అదే బ్రహ్మానందం ఇదే ఆత్మ సాక్షాత్కా

Related Articles