NewsWaves.news

కొత్త మంత్రుల శాఖ‌లివేనా.. ?

ఎట్ట‌కేల‌కు తెలంగాణ మంత్రి వ‌ర్గవిస్త‌ర‌ణ జ‌రిగింది. రెండు నెల‌ల‌గా ఈ రోజు రేపూ అనుకుంటున్న ఈ కార్య‌క్ర‌మం ఈ రోజు రాజ్ భ‌వ‌న్ లో ఘ‌నంగా జ‌రిగింది. కొద్ది సేప‌టి క్రిత‌మే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్ ఎంచుకున్న మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అయితే శాఖ‌ల విష‌యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి ఏ శాఖను కేటాయించనున్నార‌నే అనే విష‌యం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చాణీయాంశంగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం మంత్రుల‌కు ఈ శాఖ‌లు కేటాయించ‌నున్నార‌ట‌.

1.అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి -వైద్య‌, ఆరోగ్యం

2.త‌లసాని శ్రీనివాస్- పౌర‌స‌ర‌ఫ‌రా

3.జ‌గ‌దీష్ రెడ్డి – రోడ్లు, భ‌వ‌నాలు, రవాణ‌

4.ఈట‌ల రాజేంద‌ర్ -సంక్షేమ శాఖ‌

5.సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి – ఆర్థిక శాఖ‌

6.కొప్పుల ఈశ్వ‌ర్ రెడ్డి – విద్యా శాఖ‌

7.వేముల ప్ర‌శాంత్ రెడ్డి – ప‌రిశ్ర‌మ‌ల

8.మ‌ల్లారెడ్డి – విద్యుత్

9.ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు- వ్య‌వ‌సాయం

10. వి. శ్రీనివాస్ గౌడ్‌- పుర‌పాల‌క‌, ఆబ్కారి

Related Articles