NewsWaves.news

తెలంగాణ కొత్త మంత్రుల‌కు శాఖ‌లు ఖ‌రారు

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు ఈరోజు మంత్రులుగా ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు మొత్తం 10 మంది మంత్ర‌లు ఈ రోజు రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణం స్వీకారం చేశారు. రాష్ట్ర గవ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ఈ మేర‌కు అధికారికంగా వారితో ప్ర‌మాణం చేయించారు. అయితే శాఖ‌ల కేటాయింపుల‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు కొద్ది స‌మ‌యం క్రితం తెర‌ప‌డింది. మంత్రుల కేటాయింపున‌కు సంబంధించి టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది. ఆ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం…

మంత్ర‌లు శాఖ‌లివే..

ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ

వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ

తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ

కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ

ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్

అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం

వి. శ్రీనివాస్‌గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు

చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి

Related Articles