NewsWaves.news

ప్రభుత్వం వెంటే మేముంటాం : ప్రతిపక్షాలు

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ హాజరయ్యాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో భారత జవాన్లపై జరిగిన దాడిని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా మద్దతుగా ఉంటామని విపక్షాలు కేంద్రానికి హామీ ఇచ్చాయి. పుల్వామా ఘటనపై తీసుకునే చర్యల విషయంలో తామంతా భారత ప్రభుత్వం వెంటే ఉంటామని స్పష్టం చేసాయి ప్రతిపక్షాలు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ తరపున హాజరైన హాజరైన గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ పుల్వామా ఘటనపై దేశమంతా ఆగ్రహంగా ఉందని, ఈ క్లిష్ట పరిస్థితులలో తాము భద్రతా బలగాలకు అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ దేశ రక్షణ విషయంలో కలిసే పని చేస్తామని అయన స్పష్టం చేసారు.

Related Articles