NewsWaves.news

ద‌క్షిణ కోరియాలో ప్ర‌ధాని మోదీ బిజీ బిజీ

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం సియోల్ (ద‌క్షిణ కోరియా) చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని ద‌క్షిణ కోరియా అధ్య‌క్షుడు మూన్ జే ఇన్‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. అనంత‌రం సియోల్ శాంతి పుర‌స్కారాన్ని స్వీక‌రించనున్నారు.

అంతర్జీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గాను మోదీని దక్షిణకొరియా ఈ పురస్కారంతో సత్కరిస్తోంది.

కీల‌కాంశాలు

  • ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో ప్రధాని ప్ర‌సంగించ‌నున్నారు.
  • ఇండియా-దక్షిణకొరియా స్టార్టప్ హబ్ ను ఆవిష్క‌రించ‌నున్నారు.
  • కింహే సిటీలో దక్షిణ కోరియా అధ్య‌క్షుడితో రేపు స‌మావేశం కానున్నారు.

Related Articles