NewsWaves.news

టైమ్ అండ్ ప్లేస్ చెప్పండి : జ‌వాన్ల‌కు మోదీ పిలుపు

ప్ర‌ధాన‌మంత్రి మోదీ భార‌త జ‌వాన్ల‌కు పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారం తీర్చుకునే విష‌యంలో పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్టు.. దీని కోసం స‌రైన స‌మ‌యం, ప్రాంతం చెప్పాలన్నారు ప్ర‌ధాని. యూపీలోని ఝాన్సీలో డిఫెన్స్ కారిడార్ కు శంకుస్థాప‌న చేసిన మోదీ ఈ మేర‌కు సైనికుల్లో మాన‌సిక స్థైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు.

ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారం తీర్చుకునేందుకు భార‌త సైన్యానికి త‌గిన అనుమ‌తులు ఇస్తామ‌న్నారు మోదీ. మ‌న జ‌వాన్ల త్యాగం వృధా కాదు. వారి తెగువను దేశం వీక్షించింది. వారిని బ‌లి తీసుకున్న ఉగ్ర‌వాదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు మోదీ..

Related Articles