NewsWaves.news

భారీ మూల్యం చెల్లిస్తారు : ప‌్ర‌ధాని మోదీ వార్నింగ్‌

గురువారం జ‌మ్ముక‌శ్మీర్ లో ఉగ్ర‌దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌మ్ముక‌శ్మీర్‌లో సెక్యూరిటీ ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు మంత్రీ మండ‌లి అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించింది.

ఈ స‌మావేశంలో (క్యాబినెట్ క‌మిటీ ఆన్ సెక్యూరిటీ -సిసిఎస్‌) ప్ర‌ధాన మంత్రి మోదీ, ర‌క్ష‌ణ శాఖా మంత్రి, హోమ్ మినిస్ట‌ర్‌, విదేశాంగ, అర్థిక మంత్రులు పాల్గొన్నారు. దేశ ర‌క్ష‌ణ‌, వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల‌పై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌మూక‌ల‌కు ప్ర‌ధాని మోదీ గ‌ట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు చేసిన దాడికి చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటారు. ఈ దాడికి పాల్ప‌డిన వాళ్ల‌ను త‌గిన విధంగా శిక్షిస్తామ‌ని పాకిస్తాన్ ప్ర‌పంచానికి హామీ ఇవ్వాలి అని తెలిపారు ప్ర‌ధాని.

Related Articles