NewsWaves.news

దాడి జ‌రిగే స‌మ‌యంలో కంట్రోల్ రూమ్‌లో ప్ర‌ధాని మోదీ ?

పుల్వామా దాడి అనంత‌రం ప్ర‌ధాని మోదీ అన్న మొద‌టి మాట‌.. దాడికి ప్ర‌తీకారం తీర్చుకుంటాం అని. అన్న‌ట్టుగానే ప్ర‌ధాని మాట‌పై నిల‌బ‌డ్డారు. అప్ప‌ట్లో యూరీ దాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్‌లో సీక్రెట్ ఆప‌రేష‌న్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్ర‌ధాని.. ఈ సారి పాకిస్తాన్‌లో ఎంట‌రై మ‌రీ ఉగ్ర‌స్థావ‌రాల‌ను పేల్చేలా చూసుకున్నారు.

ఇండియ‌ర్ ఎయిఫోర్స్ కు చెందిన 12 మిరాజ్ -2000 జెట్ ఫైట‌ర్స్ అటు పాకిస్తాన్‌లోని బ‌లాన్‌కోట్ లో దాడి జ‌రిగే స‌మ‌యానికి ప్ర‌ధాని మోదీ ఎయిర్‌ఫోర్స్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ద‌గ్గ‌రుండి మ‌రి ఈ దాడుల‌కు సంబంధించిన అంశాల‌ను ప‌ర్య‌వేక్షించార‌ట‌. ఫైట‌ర్‌జెట్స్ త‌మ ప‌నిని పూర్తి చేసుకుని భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించాకే ఆయ‌న కంట్రోల్ రూమ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చారని స‌మాచారం.


Related Articles