NewsWaves.news

ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది : ప్రధాని మోడీ

భారత వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో చేసిన మెరుపు దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మెరుపుదాడి చేసిన వీరులకు తలవంచి నమస్కారం చేద్దామంటూ జాతికి పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో భారత వాయుసేన మెరుపుదాడి గురించి ప్రస్తావించారు మోడీ.

ఈ దేశానికి, జాతికి ఎప్పటికీ తలవంపులు రానివ్వనంటూ మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ” ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నాను. భారతావని ఎప్పటికీ తల ఎత్తుకునే ఉంటుంది.

ఈ దేశ గౌరవ, మర్యాదను మంటకలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని” మోడీ ప్రకటించారు. భారత జాతి ప్రయాణం ఆగదని, ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుందని, జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని అన్నారు ప్రధాని మోడీ.

Related Articles