NewsWaves.news

ఫలితాల తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తాం

ఈనెల 23వ తేదీన ప్రజా తీర్పు బయటకు వచ్చిన తర్వాతే బీజేపీయేతర కూటమికి ఎవరు ప్రధాని అనే దానిపై కీలక నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ‘మాయావతి లేదా ఇతర నాయకుల గురించి నేను కామెంట్ చేయదలచుకోవాలి. సైద్ధాంతిక పరంగా చూసినప్పటికీ అన్నీ విస్తృత ప్రాతిపదికపై కలుస్తాయి. మమతా, చంద్రబాబునాయుడు, మాయావతి, ములాయం సింగ్‌లు బీజేపీకి మద్దతిస్తారని నేను అనుకోవడం లేదు’ అని రాహుల్ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

23న ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వంలో ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రజాతీర్పు రాకముందే తాను మాట్లాడటం బాగుందని, ప్రజలేమి నిర్ణయించుకున్నారనే దానిపై ఆధారపడి తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ నెల 19 తో ఎన్నికలు ముగుస్తాయి.అదేరోజు సాయంత్రం ఏక్సిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ నెల 23 న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి