NewsWaves.news

సోంబెరి పైల‌ట్‌…విమానం గాల్లో ఉండ‌గానే ప‌డుకున్నాడు

విమానం గాల్లో ఉన్న‌ప్పుడు పైల‌ట్ ఏం చేయాలి…విమానాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుతూ.. దాన్ని గ‌మ్య‌స్థానానికి తీసుకెళ్లాలి. కానీ చైనాకు చెందిన ఈ పైల‌ట్ మాత్రం కాక్‌పిట్‌లోనే కాసేపు కునుకేశాడు. అయితే అప్పుడు విమానం 35 వేల అడుగుల ఎత్తులో ఉంది. మ‌రి విమానం ప‌రిస్థితి ఏంట‌నేగా మీ అనుమానం… ఏదో మ్యానేజ్ చేసి ర‌న్‌వేపై దింపారు లెండి. అయితే ఈ బోయింగ్ 747 విమానంలో తొటి పైల‌ట్ నిద్ర‌పోతుంటే.. కో పైల‌ట్ త‌ట్టి లేపాల్సింది పోయి.. అలాగే చూస్తూ ఉండిపోయాడట‌.


ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైల‌ర్ అవుతోంది. ఈ ఇద్ద‌రు పైల‌ట్ల‌ను చైనా విమాన‌యాన అధికారులు విధుల నుంచి తొల‌గించిన‌ట్టు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు అనుకుంటా. అయితే నిద్ర‌పోయిన ఆ పైల‌ట్ (వెంగ్ జియాఘీ)కి 20 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ట‌. ఈ 20 ఏళ్ల‌లో ఇలా ఎన్నిసార్లు నిద్ర‌పోయాడో అని సోష‌ల్ మీడియాలో చాలా మంది విమ‌ర్శిస్తున్నారు.

Related Articles