NewsWaves.news

పీఎఫ్ పై వడ్డీ పెంపు

ప్రావిడెంట్ ఫండ్ (భవిష్య నిధి) డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ 8.65 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. నిన్న జరిగిన ఈపిఎఫ్ఓ కేంద్ర మండలి సమావేశంలో వడ్డీ రేట్లు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

కొన్ని రోజుల్లో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రికి పంపిస్తామని ఆయన అన్నారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందగానే చందాదారుల ఖాతాలలో ఆ వడ్డీ జమ అవుతుందని అన్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వడ్డీరేట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related Articles