NewsWaves.news

విదేశీ లీగుల్లో భారత క్రికెటర్లను ఆడించండి.. పాక్ సూచన

టీం ఇండియా క్రికెటర్లు ఇతర దేశాల ప్రీమియర్ లీగుల్లో కూడా ఆడితే బాగుంటుందని, అందుకు బీసీసీఐ అనుమతివ్వాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌ ఇసాన్‌ మనీ అభిప్రాయపడ్డారు. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతున్నట్లే భారత్ ఆటగాళ్లు కూడా విదేశాలకి వెళ్లి ఆడితే బాగుంటుందని ఇసాన్ అన్నారు.

ఇప్పటివరకు భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా వేరే దేశాల ప్రీమియర్ లీగ్ లలో ఆడటం లేదు. గతంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడారు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ నిషేదించింది. దీంతో దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ను ప్రారంభించింది పాక్ క్రికెట్ బోర్డు.

Related Articles