NewsWaves.news

నా మనసుకి ఇప్పటికీ కర్నూలే రాజధాని.. పవన్ కళ్యాణ్

నేడు కర్నూలులో విద్యార్థులతో పవన్ ముఖాముఖి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. తన మనసుకు ఇప్పటికీ కర్నూలే రాజధాని అని వ్యాఖ్యానించారు.రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానికి మించిన నగరంగా అభివృద్ధి చేస్తానని, రాయలసీమకు ఒకప్పటి వైభవాన్ని మళ్లీ తీసుకొస్తానని తెలిపారు.కర్నూలు జిల్లా అభివృద్ధి జరగకుండా ఆపింది ఫాక్షనిజం, రౌడీయిజం అని ఆయన అన్నారు.

ఇక తాను రాజకీయాల్లోకి మోసం చేయడానికి రాలేదని,తాను డబ్బులకు అమ్ముడు పోయే మనిషిని కానని, ప్రజల సమస్యలపై పోరాటానికి వచ్చానని మరోసారి స్పష్టం చేశారు.తన దగ్గర వేల కోట్ల డబ్బు లేకపోవచ్చు కానీ.. కాన్షీరామ్ స్ఫూర్తి తన గుండెల నిండా నింపుకున్నానని ఆయన తెలిపారు.

తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశానని, రాజకీయాలను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని పవన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కులాలను, మతాలను చూసి ఓట్లు వేయడం సరైనది కాదని ఈ సందర్భంగా పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Related Articles