NewsWaves.news

కార్యకర్తలే నా పత్రికలు, ఛానళ్లు : పవన్ కళ్యాణ్

ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వకుండా తాను సొంతంగా పోటీ చేయడం టీడీపీ, వైసీపీలకు ఇష్టం లేదని పవన్ అన్నారు. జనసేనను.. బీజేపీ,వైసీపీల మద్దతుదారుగా టీడీపీ చిత్రీకరిస్తోందని, రాజ్ భవన్ లో కేసీఆర్ ను కలిసిన సందర్భాన్ని సాకుగా చేసుకొని టీఆర్ఎస్, వైసీపీలతో కుమ్మక్కు అయ్యానని టీడీపీ అంటోందని.. మరోవైపు తనను టీడీపీ భాగస్వామిగా వైకాపా ఆరోపిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.

జనసేన ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని పత్రికలు కథలను రాస్తున్నాయని అయితే ‘నాకు మాత్రం జనసైనికులే పత్రికలు, టీవీ ఛానళ్లు’ అని పవన్ స్పష్టం చేశారు. నిన్న ఆకస్మిక మరణం చెందిన తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

Related Articles