NewsWaves.news

కర్నూల్ లో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. నేడు అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 3 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కర్నూలు నగరానికి చేరుకుంటారు.
అక్కడ కొండారెడ్డి బురుజు వరకు జరిగే రోడ్‌ షోలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం యూబీఆర్‌ ఫంక్షన హాలులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. 27వ తేదీన కర్నూలు నుంచి కడప జిల్లా పర్యటనకు పవన్ బయల్దేరి వెళ్తారు

Related Articles