NewsWaves.news

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో పారడైస్ హోటల్

ప్రముఖ హైదరాబాదీ బిర్యానీ.. ‘ప్యారడైజ్‌‌ బిర్యానీ’ మరో అరుదైన ఘనతను సాధించింది. సంవత్సరంలో అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది.

ఏడాదిలోనే దాదాపు 70 లక్షల మందికిపైగా పారడైస్ బిర్యానీ రుచిని ఆస్వాదించారు. ఇంతమందికి సేవలు అందించినందుకు ‘ప్యారడైజ్‌’ లిమ్కా బుక్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేగాక బెస్ట్‌ బిర్యానీ అవార్డు పారడైస్ సొంతం అయింది. ప్యారడైజ్‌‌ హోటల్ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రధానం చేసింది.

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో పారడైస్ బాధ్యత మరింత పెరిగిందని సంస్థ ఛైర్మన్‌ అలీ తెలిపారు.

Related Articles