NewsWaves.news

ఆస్ట్రేలియాతో మ్యాచుల‌కు హార్దిక్ పాండ్యా దూరం

భార‌త క్రికెట్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్. త్వ‌ర‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న లిమిటెడ్ ఓవ‌ర్ల సీరిస్‌కు టీమ్ ఇండియా ఆల్ రౌండ్ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. వెన్ను నొప్పి బాధ కార‌ణంగా ఈ సిరీస్ మొత్తానికి పాండ్యా దూరం కానున్న‌ట్టు బీసీసీఐ ప్ర‌క‌టించింది.

గ‌తేడాది పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ త‌ర్వాత పాండ్యాకు వెన్నునొప్పి రావడంతో అప్ప‌ట్లో సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.. ఇప్పుడు మ‌ళ్లీ సిరీస్‌కు దూరం అయ్యేలా ఉన్నాడు. భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య సిరీస్‌ ఆదివారం నుంచి ఆరంభం కానుంది. తొలుత టీ20 సిరీస్‌ జరుగనుండగా, ఆపై ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Related Articles