NewsWaves.news

భారత్ దాడిచేస్తే తిప్పికొట్టండి : పాక్ ప్రధాని

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన పాకిస్తాన్ భద్రతా మండలి నిన్న సమావేశమైంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ పై దాడికి పాల్పడితే.. ఆ దాడికి అంతే ధీటుగా, సమగ్రంగా స్పందించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం. పుల్వామా దాడితో పాకిస్థాన్ కు సంబంధం లేదని జాతీయ భద్రతా మండలి అభిప్రాయపడింది.


మరోవైపు కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను నియంత్రించాలని పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హఫీజ్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా, దాని అనుబంధ సంస్థ పాలాహి ఇన్సానియత్ ఫౌండేషన్ లపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. నిన్న జరిగిన జాతీయ భద్రతా కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ నిషేధం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో మాత్రం ప్రకటించలేదు.

Related Articles