NewsWaves.news

ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌ను ఓడించి తీరుతాం : మాజీ పాక్ క్రికెట‌ర్‌

ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్ర‌తీసారి భార‌త్ చేతిలో ఓడిపోవ‌డం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. సిరీస్‌లో ఎలాగూ గెల‌వ‌లేరు కాబ‌ట్టి కనీసం మాట‌ల‌తో అయినా గెలుద్దామని ప్ర‌య‌త్నిస్తోంది పాకిస్తాన్ టీమ్‌. పాకిస్తానీ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఈ వ‌రుస‌లో ముందుగా ఉన్నాడు. దాయాదుల స‌మరంలో ఎప్పుడూ ఓడిపోయే పాకిస్తాన్ ఈ సారి త‌ప్ప‌కుండా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను చిత్తుచేస్తుందంటున్నాడు ఈ మాజీ కెప్టెన్‌. ఇప్ప‌టి దాకా ఆరు ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌రిగినా అందులో అన్నీ భార‌త్ గెలిచింది.. కానీ ఈ సారి అలా జ‌ర‌గ‌దు చూసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మొయిన్ ఖాన్‌.

పాకిస్తాన్ టీమ్ కు ఇప్పుడు ప్ర‌పంచంలో ఏ టీమ్ ను అయినా ఓడించే స‌త్తా ఉంద‌ని.. ..కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ జ‌ట్టును చ‌క్క‌గా తీర్చిదిద్దాడ‌ని పొగిడాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వ‌డం కామ‌న్‌. మ‌రి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న టీమ్ ఇండియాను పాకిస్తాన్ ఎలాంటి పోటీ ఇవ్వ‌నుందో చూడాలి. 2019 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు జూన్ 16న తలపడనున్నాయి

Related Articles